: ఒకే కుటుంబం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న 118 మంది


ఒక కుటుంబం నుంచి సాధారణంగా మూడు నాలుగు ఓట్లు ఉండడం సాధారణం. ఒకవేళ ఉమ్మడి కుటుంబమైతే, మహా అయితే, పది ఓట్లుంటాయేమో! అయితే, అసోం రాష్ట్రంలోని పూల్గురి నేపాలీపామ్ గ్రామంలో నివాసముండే ఓ కుటుంబంలోని 118 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోనిత్ పూర్ జిల్లాలోని తేజ్ పూర్ లోక్ సభ నియోజకవర్గంలోకి ఈ గ్రామం వస్తుంది.

నేపాల్ నుంచి భారత్ కు వలస వచ్చిన రోన్ బహదూర్ థాపా ఐదు పెళ్లిళ్లు చేసుకుని 12 కుమారులు, తొమ్మిది మంది కుమార్తెలకు తండ్రయ్యాడు. వీరంతా ఒకే చోట నివసిస్తున్నారు. థాపా మేనల్లుడు రుద్ర బహదూర్ కూడా వీరితోపాటే ఉంటున్నాడు. బహదూర్ థాపా తన 115వ ఏట మరణించాడు.

కుమారుల కుటుంబాల నుంచి 60 మంది, కుమార్తెల కుటుంబాల నుంచి 52 మంది, రుద్రబహదూర్ కుటుంబం నుంచి ఆరుగురు ఓటర్లున్నారు. 118 ఓట్లు వీరి ఇంటి నుంచి ఉండడంతో ఎన్నికల సమయంలో వీరి ఇంటి ముందు రాజకీయ నాయకులంతా బారులు తీరుతారు.

  • Loading...

More Telugu News