: బ్రిటన్ లో ఏప్రిల్ 19న శ్రీరామనవమి ఉత్సవాలు


బ్రిటన్ లో రీడింగ్ హిందూ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ (శనివారం)న శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. భారత్ నుంచి ప్రత్యేకంగా పిలిపించిన వేదపండితులు ఈ కల్యాణోత్సవ కార్యక్రమాన్ని జరిపించనున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ విశేషాలను టెంపుల్ ప్రతినిధి కేఎస్ఆర్ మోహనరావు మీడియాకు తెలిపారు.

విట్లే స్ట్రీట్ లోని రీడింగ్ హిందూ టెంపుల్ ఆధ్వర్యంలో 19వ తేదీ, శనివారం ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 10 గంటలకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం, 12 గంటలకు ఆశీర్వచనం, ఒంటి గంటకు శ్రీరామ సంకీర్తనలు, 1.30కి మహాప్రసాదం ఉంటుందని మోహనరావు తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు మరిన్ని వివరాల కోసం www.bhaktisampradaya.org/ sriramanavami వెబ్ సైట్ ని సందర్శించవచ్చు. అలాగే కార్యక్రమ వివరాలకు సంబంధించి కేఎస్ఆర్ మోహనరావును 0788 2604 724 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.

  • Loading...

More Telugu News