: యువరాజ్ ఒక్కడే ఓటమికి కారణం కాదు: యోగ్ రాజ్
టీ20 ప్రపంచ కప్ ఓటమికి యువరాజ్ సింగ్ ఒక్కడే కారణం కాదని యూవీ తండ్రి యోగ్ రాజ్ అన్నారు. చండీగఢ్ లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... 21 బంతుల్లో 11 పరుగులు చేసేందుకు యువరాజ్ ఎంతో శ్రమించాడని చెప్పారు. అయితే ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాడని మీడియాలో వెలువడుతోన్న కథనాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఓటమికి అందరిదీ బాధ్యత అని ఆయన అన్నారు.