: క్లార్క్ స్థానంలో ఫించ్
గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా సారథి మైకేల్ క్లార్క్ స్థానంలో హార్డ్ హిట్టర్ ఆరోన్ ఫించ్ ను తీసుకోవాలని పుణే వారియర్స్ ఇండియా నిర్ణయించింది. క్లార్క్ వెన్నెముక గాయం కారణంగా ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. దీంతో, పుణే వారియర్స్ ఫించ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకే చెందిన ఫించ్ దూకుడుగా ఆడడంలో దిట్ట. కాగా, పుణేతో ఒప్పందం గురించి ట్విట్టర్లో పేర్కొన్న ఫించ్, రేపు భారత్ రానున్నట్టు వెల్లడించాడు.