: కాసేపట్లో... కడపలో టీడీపీ ‘ప్రజాగర్జన’


కడపలో మరికాసేపట్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా గర్జన ప్రారంభమవుతోంది మున్సిపల్ గ్రౌండ్స్ లో జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్యాహ్నానికి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కడప చేరుకోనున్నారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. వైఎస్సార్ సొంత జిల్లా అయిన కడపలో టీడీపీ 12వ ప్రజాగర్జన జరగనుంది.

ఈ సందర్భంగా కడప జిల్లా టీడీపీ నేత రాంగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... అవినీతి, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా చంద్రబాబు అన్ని జిల్లాల్లో ‘ప్రజాగర్జన’ నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో ఇవాళ కడపలో సభ జరుగుతోందని అన్నారు. ఈ సభకు జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి సుమారు 3 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. కడప జిల్లాలో 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News