: ఇదే ఐసీసీ ప్రపంచ టీ20 జట్టు


ప్రపంచ టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. టైటిల్ పోరులో చతికిలబడ్డ టీమిండియా కెప్టెన్ ధోనీని ఐసీసీ టీ20 ప్రపంచ జట్టుకు కెప్టెన్ గా ఐసీసీ ప్రకటించింది. బంగ్లాదేశ్ లో టీ20 ప్రపంచకప్ నిర్వహించినందున ఆ దేశ నిబంధనలను అనుసరించి జట్టును తయారు చేశామని ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తెలిపారు. వివిధ దేశాలతో కూడిన ఆటగాళ్లతో జట్టును తయారు చేయడం సవాలని, వారి ప్రదర్శనను మాత్రమే పరిగణనలోకి తీసుకుని జట్టును తయారు చేశామని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రపంచ టీ20 జట్టులో నలుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం విశేషం. బౌలింగ్ లో ప్రపంచ టీ20 జట్టు పటిష్ఠంగా ఉండడం విశేషం. డేవిడ్ బూన్ వెల్లడించిన 11 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలు... మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్(ఇండియా), జేపీ డుమిని, డేల్ స్టెయిన్(సౌతాఫ్రికా), మ్యాక్స్ వెల్(ఆస్ట్రేలియా), స్టీఫెన్ బర్గ్(నెదర్లాండ్స్), డారెన్ సమీ, శామ్యూల్ బద్రి(వెస్టిండీస్), లసిత్ మలింగ(శ్రీలంక).

  • Loading...

More Telugu News