: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బెయిల్


కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బెయిల్ మంజూరయింది. కోర్టు ధిక్కారణ కేసులో గత శుక్రవారం నాడు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. 2010లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. అయితే, ఈ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంతో... కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

  • Loading...

More Telugu News