: ప్రపంచ నెంబర్ వన్ షూటర్ భారతీయురాలు
గత కొంత కాలంగా స్థిరమైన ప్రతిభ ప్రదర్శిస్తున్న భారతీయ షూటర్ హీనాసిద్దు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది. ఇంటర్నేషనల్ షూటింగ్ ఫెడరేషన్ తాజా ర్యాంకింగ్స్ విడుదల చేస్తూ ఈ విషయం వెల్లడించింది. గత నెల కువైట్ లో జరిగిన ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించిన హీనాసిద్దు, ఫోర్ట్ బెనింగ్ లో జరిగిన వరల్డ్ కప్ లో రజతం సాధించింది. 2013 మ్యూనిక్ వరల్డ్ కప్ లో బంగారు పతకం సాధించిన హీనా ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.