: షర్మిలకు కనీస అవగాహన కూడా లేదు: సోమిరెడ్డి
అవిశ్వాసం ఎప్పుడు, ఎలా పెట్టాలో టీడీపీకి తెలుసునని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో తమకు ఎవరి సలహాలు అక్కర్లేదన్నారాయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సామర్థ్యం ఉండి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే తాము మద్దతిస్తామని చెప్పారు. న్యాయస్థానాలకు వ్యతిరేకంగా ప్రతిసారీ మాట్లాడుతూ షర్మిల కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారన్నారు. ఈ మాటలతో ఆమెకు కనీస అనుభవం, అవగాహన, ఎలాంటి పరిపక్వత లేవని తెలుస్తోందని ఎద్దేవా చేశారు.