: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వీకే మూర్తి కన్నుమూత
ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ వీకే మూర్తి (90) కన్నుమూశారు. ఈ ఉదయం ముంబై శంకరపురంలోని తన నివాసంలో వృద్ధాప్యపు సమస్యల కారణంగా ఆయన తుది శ్వాస విడిచినట్లు మేనకోడలు నళిని వాసుదేవ్ తెలిపారు. ఆయనకు ఒక కుమార్తె ఛాయా మూర్తి ఉన్నారు. భారతీయ తొలి సినిమాస్కోప్ మూవీ 'కాగజ్ కే ఫూల్'ను తన కెమెరా ద్వారా చూపిన మూర్తి 'ప్యాసా', 'సాహిబ్, బీబీ ఔర్ గులామ్' వంటి గురుదత్ క్లాసికల్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. 2008లో దాదా సాహెబ్ పాల్కే పురస్కారం పొందిన తొలి టెక్నీషియన్ ఆయనే కావడం విశేషం.