: దీక్ష శిబిరంలో నారా లోకేశ్
విద్యుత్ సమస్యతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని నారా లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వారిని పరామర్శించేందుకు నారా లోకేశ్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు వచ్చారు. ఎమ్మెల్యేల పరిస్థితిపై వాకబు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగురోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలనే పట్టించుకోని సర్కారు రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటుందని లోకేశ్ మండిపడ్డారు.