: నల్గొండ, భువనగిరి స్థానాలకు నామినేషన్లు వేసిన సీపీఎం
నల్గొండ, భువనగిరి స్థానాలకు సీపీఎం అభ్యర్థులు నంద్యాల నర్సింహారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలనేది తమ పార్టీ లక్ష్యమని అన్నారు. ఈ రెండు పార్టీలను ఓడించేందుకు తెలంగాణలో ఏ పార్టీతోనైనా జత కట్టేందుకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.