: భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో వనమా భేటీ
ఖమ్మంజిల్లా కొత్తగూడెం సీటు దక్కకపోవడంపై కుతకుతలాడిపోతున్న ఖమ్మం డీసీసీ చీఫ్ వనమా వెంకటేశ్వరరావు పాల్వంచలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. స్వతంత్రంగానైనా పోటీకి దిగాలని కార్యకర్తలు ఆయనకు సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ వనమా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కింది నుంచి పై వరకు అంతా డబ్బుమయమైపోయిందని వనమా మండిపడ్డారు.