: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దు: పొన్నం
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోరాదని ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. ఈరోజు ఉదయం హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాదని పార్టీని వీడిన నేతలంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే గతంలో వివేక్ పార్టీని వీడారని పొన్నం వివరణ ఇచ్చారు.
తెలంగాణను వ్యతిరేకిస్తూ కొందరు కాంగ్రెస్ ను వీడి చెప్పు గుర్తుతో పార్టీ పెట్టారని ఈ సందర్భంగా పొన్నం గుర్తు చేశారు. అయితే అలాంటి వారికి చెప్పుతోనే సమాధానం చెప్పాలని ఆయన ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో ఓట్లు చీల్చడం ఇటు కాంగ్రెస్ కు, అటు టీఆర్ఎస్ కు మంచిది కాదని పొన్నం అభిప్రాయపడ్డారు.