: యువరాజ్ సింగ్ ఇంటిపై రాళ్ల దాడి!
ఐసీసీ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ను ఫైనల్లో చేజార్చుకున్న టీమిండియా జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జట్టు విజయావకాశాలను ఫైనల్లో పరోక్షంగా చేజార్చిన యువరాజ్ సింగ్ పై మండిపడుతున్నారు. దాంతో, కొంతమంది అభిమానులు ఛండీఘడ్ లోని యువీ ఇంటిపై రాళ్లు విసిరినట్లు సమాచారం. ఈ ఘటనతో అప్రమత్తమై ఇంటి వద్ద సెక్యూరిటీని పెంచారు.
గతంలో 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచేందుకు, 2011 వన్డే ప్రపంచకప్ సాధించేందుకు యూవీనే కారకుడయ్యాడు. ఈసారి మాత్రం లంక చేతిలో కప్ చేజార్చుకోవడానికి కూడా అతనే కారకుడవడం ఆశ్చర్యపరిచే విషయం. ఫైనల్లో కీలకమైన దశలో బంతులు వృథా చేసి జట్టు అవకాశాల్ని యూవీ పూర్తిగా దెబ్బతీశాడు.