: అరకు సీటుపై పునరాలోచనలో బీజేపీ
టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీకి అరకు లోక్ సభ స్థానాన్ని కేటాయించినట్టు సమాచారం. అయితే ఈ స్థానం విషయంలో బీజేపీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అరకు బదులు కాకినాడ లేదా ఒంగోలు స్థానాలను బీజేపీ అడుగుతోంది. దీనికి సంబంధించి ఇరు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు.