: కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
కర్నూలు జిల్లాలో టీడీపీ-వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ మండలం పెరాయిపల్లిలో ఈరోజు ఉదయం టీడీపీ వర్గీయుల నివాసాలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి యత్నించారు. దాడి నుంచి తప్పించుకున్న టీడీపీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దాంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.