: కేసీఆర్ అధికార దాహంతోనే ప్రజలను విడదీస్తున్నారు: మధుయాష్కీ
తెలంగాణ వ్యతిరేకులైన కొండా సురేఖ దంపతులను తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎలా చేర్చుకున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ప్రశ్నించారు. కేసీఆర్ కేవలం అధికార దాహంతోనే ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వివేక్ నివాసంలో ఈ రోజు ఉదయం పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, మధుయాష్కీ సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చలు జరిపారు.
కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం కాకపోవడంతో తనపై కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగిందని వివేక్ ఈ సందర్భంగా తెలిపారు. అందుకే తిరిగి కాంగ్రెస్ లో చేరినట్టు ఆయన చెప్పుకొచ్చారు. మంత్రి శ్రీధర్ బాబుతో తనకెలాంటి విభేదాలు లేవని వివేక్ స్పష్టం చేశారు.