: మడోన్నా... ఇప్పుడు 'మనీ' మహారాణి


ఆమె నీలికళ్ళ సోయగం చాలు.. అభిమానులను వెర్రెత్తించడానికి. ఇక ఆమె ట్రేడ్ మార్క్ అయిన హస్కీ వాయిస్ తో ఓ గీతం ఆలపించిందంటే, మద్యం సేవించకుండానే కిక్కెక్కిపోయే వారికి లెక్కేలేదు. ప్రియుడి చెవిలో ఊసులాడే ప్రియురాలిలా.. ఆడియెన్స్ తో సంభాషించినట్టుండే ఆమె పాటలంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజో. నడి వయస్సులో ఉన్నా తరగని ఛరిష్మా ఆమె సొంతం. ఇదంతా కూడా ప్రపంచ పాప్ సామ్రాజ్ఞి మడోన్నా గురించే. ఇంతకీ విషయం ఏమిటనుకుంటున్నారా. మడోన్నా ఇప్పుడు మహిళా పాప్ స్టార్లలోకెల్లా అత్యంత ధనికురాలు. ప్రస్త్తుతం ఆమె ఆస్తుల విలువ 5 వేల కోట్ల రూపాయలు దాటిందట. దీంతో, సంపన్న సెలెబ్రిటీలైన స్టీవెన్ స్పీల్ బెర్గ్, ఓప్రా విన్ ఫ్రే సరసన చేరిందీ 'ఎరోటికా' బేబీ. 

  • Loading...

More Telugu News