: టీడీపీ, బీజేపీ పొత్తు అనైతికం: హరీష్ రావు
టీడీపీ, బీజేపీల పొత్తు అనైతికమని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీతో పొత్తు తప్పని చంద్రబాబునాయుడు గతంలో అన్నారని ఆయన గుర్తు చేశారు. టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ ఓట్ల శాతం తగ్గుతుందని ఆయన తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ లబ్ది పొందాలని చూస్తోందని హరీష్ రావు దుయ్యబట్టారు.