: బాలీవుడ్ పై కోయల్ కన్ను
ఫెమీనా మిస్ ఇండియా విజేతగా నిలిచిన జైపూర్ అందాల భామ కోయల్ రాణా బాలీవుడ్ పై కన్నేసింది. తన తదుపరి లక్ష్యం మిస్ వరల్డ్ అని చెప్పిన కోయల్... ఆ లోపు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లు వస్తే తప్పకుండా అంగీకరిస్తానంటూ సంకేతాలు పంపింది. శనివారం రాత్రి ముంబైలో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా-2014 ఫైనల్ పోటీలో కోయల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యున్నతంగా ఉండాలనుకుంటున్నానని, జీవితంలో ఏం చేయాలన్న దానిపై తనకు స్పష్టత ఉందని కోయల్ చెప్పింది. తనకు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఆదర్శమని, ఆమె జీవితంలో ఎంతో సాధించినట్లు పేర్కొంది. అందానికి, తెలివికి సుస్మిత ఒక అసలైన ఉదాహరణగా చెప్పింది.