: ఉద్యోగులకు నష్టం జరగకుండా చూడాలి: అశోక్ బాబు
విభజన సమయంలో ఉద్యోగులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అన్యాయం జరిగితే మరోసారి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నిన్న వైఎస్సార్సీపీ, టీడీపీలను కలసి తమ సమస్యలు చెప్పుకున్నామని, ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తామని చెప్పారు. తమ సమస్యలపై రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలని అశోక్ బాబు కోరారు.