: 'నోటా'కు గుర్తు కేటాయించాలంటున్న హైకోర్టు
ఈ ఏడాది ఎన్నికల నుంచి అమల్లోకి వస్తున్న 'నోటా' (తిరస్కరణ ఓటు)ఆప్షన్ పై దాఖలైన పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. నోటాకు ఎందుకు గుర్తు కేటాయించలేదని ఎన్నికల సంఘాన్ని కోర్టు ప్రశ్నించింది. అది ఆంగ్లంలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రజలు ఎలా గుర్తిస్తారని అడిగింది. సాధ్యమైతే ఈ సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు గుర్తు కేటాయించాలని ఈసీకి సూచించింది. అదే సమయంలో మాజీ మంత్రి శైలజానాథ్ వైద్య ఖర్చులపై న్యాయస్థానం నిలదీసింది. ప్రజాధనంతో ఎలా వైద్యం చేయించుకుంటారని ప్రశ్నించింది. దానిపై మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.