: మోడీ 3డీ మాయ... నేడు సిమ్లా సభలో పాల్గొనకుండానే ప్రచారం


మోడీ 3డీ టెక్నాలజీ సాయంతో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. అయితే, మోడీ మాత్రం అక్కడికి వెళ్లరు. స్వయంగా అక్కడికి వెళ్లకుండానే 3డీ టెక్నాలజీ సాయంతో సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకోసం సభ జరిగే చౌరా మైదానంలో 3డీ తెరను ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీ సాయంతో ఏక కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నో సభలనుద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. 2012లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మోడీ ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News