: ప్రజల ఆకాంక్షలే మా మేనిఫెస్టో: మోడీ
ప్రభుత్వాలు పేద ప్రజలకు అండగా ఉండాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు బీజేపీ మేనిఫెస్టో అద్దంపడుతోందని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోడీ ప్రసంగించారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశం అభివృద్ధి పథంలోకి వెళుతుందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.