: జేపీ ప్రచారయాత్రలో రాజమౌళి


లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఎన్నికల ప్రచార యాత్రలో దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న జేపీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు నిర్వహించిన ప్రచారయాత్రకు రాజమౌళి కూడా హాజరయ్యారు. ఈ సందర్భగా జేపీ మాట్లాడుతూ, రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, అవినీతిని రూపుమాపాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఓటర్లలో చైతన్యం పెరిగిందన్నారు.

  • Loading...

More Telugu News