: కిరణ్ కు షాక్... మళ్లీ కాంగ్రెస్ గూటికి ఎంపీ సాయిప్రతాప్


జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కు ఎంపీ సాయిప్రతాప్ షాక్ ఇచ్చారు. జేఎస్పీని వీడి మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో ఆయన భేటీ అయ్యారు. అంతకు ముందు సాయిప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగిపోయినందున జైసమైక్యాంధ్ర పార్టీతో అవసరం లేదని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారని అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ 8 సార్లు ఎన్నికల్లో నిలబడే అవకాశాన్ని కల్పించిందని... అయితే, రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్న ఆవేదనతోనే అధిష్ఠానాన్ని దూషించామని చెప్పారు. పార్టీ హైకమాండ్ తో చర్చించి... రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు.

  • Loading...

More Telugu News