: వ్యాఖ్యలు తెచ్చిన తంటాలు... అమిత్ షాపై రెండు కేసులు


రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జ్ అమిత్ షాపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లో గతేడాది ముజఫర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మత ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత గురువారం అమిత్ షా అల్లర్లు జరిగిన షామ్లిలో పర్యటించారు. అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ పలువురు మత ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా షా అన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో షాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. షా వ్యాఖ్యల వీడియోలను పరిశీలించిన ఎన్నికల సంఘం కేసు నమోదుకు ఆదేశించింది. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేేశారు.

  • Loading...

More Telugu News