: క్రీస్తు నామస్మరణతో హోరెత్తిన జెరూసలెం
క్రైస్తవులకు పుణ్యక్షేత్రమైన జెరూసలెం నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులతో పోటెత్తింది. జెరూసలెం వీధులన్నీ క్రీస్తు నామస్మరణతో హోరెత్తాయి. యేసు శిలువతో పయనించిన మార్గంలో భక్తులు శిలువలు మోసి తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. అంతకుముందు శుక్రవారం తెల్లవారు జాము నుంచే చర్చిల్లో ప్రార్థనలతో గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. ఈ రాత్రికి బెత్లెహేము చర్చిలో జరిగే ప్రార్థనలతో గుడ్ ఫ్రైడే ముగుస్తుంది.