: కాసేపట్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను బీజేపీ కాసేపట్లో విడుదల చేయనుంది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోను రూపొందించారు. అంతేకాకుండా, మేనిఫెస్టో రూపకల్పనకు ఆన్ లైన్ లో దాదాపు లక్షమంది అభిప్రాయాలను తీసుకున్నారు. ధరలను అదుపుచేసే అంశంపైనే మేనిఫెస్టోలో ప్రధానంగా ఫోకస్ చేసినట్టు సమాచారం. సుపరిపాలన, అవినీతి రహిత సమాజం, అంతర్గత భద్రత లాంటి ఎన్నో అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. రూ. 5 లక్షల వరకు పన్ను మినహాయింపు, ఉద్యోగాల కల్పనలు మేనిఫెస్టోలో ఉన్నాయి.