: నేడు కడపలో టీడీపీ ప్రజాగర్జన


తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన బహిరంగ సభ ఈ రోజు కడపలో జరగనుంది. బీజేపీతో పొత్తు కుదిరాక జరుగుతున్న తొలి ప్రజాగర్జన సభకు ఇది వేదిక కానుంది. ఈ రోజు సాయంత్రం నిర్వహించే ప్రజాగర్జన సభలో పాల్గొనేందుకు పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 3.30 గంటలకు కడప చేరుకుంటారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి నగరపాలక క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేదికపైనే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగినా ఆయన ఈ సభకు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. నిన్న రాత్రే ఆయన హైదరాబాదుకి పయనమై వెళ్ళిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

  • Loading...

More Telugu News