: దేశంలో మార్పు కోసం ఇదే సరైన సమయం: సోనాక్షి సిన్హా


దేశంలో మార్పు రావాలని, మార్పుకోసం ఇదే సరైన సమయమని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అన్నారు. ముంబయిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మంచి చేసే పార్టీకి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని తన తండ్రి చెబుతారని, ఆయన ఇప్పుడు సరైన పార్టీలోనే ఉన్నారని తెలిపారు. బీహార్ లోని పాట్నా సాహబ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ దేశానికి మంచి చేస్తారని తాను భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. తాను మాత్రం రాజకీయాల్లోకి రానని, తనకిష్టమైన సినిమా పరిశ్రమలోనే కొనసాగుతానని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News