: మహిళల కోసం సోనియా చేసింది శూన్యం: మోడీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఓ మహిళ అయివుండి కూడా మహిళల కోసం చేసిందేమీ లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ విమర్శించారు. ఇప్పటికీ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బహిర్భూమికి వెళ్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కోసం కనీసం మరుగుదొడ్లు కూడా కట్టించలేకపోయారని ఆరోపించారు. మహిళల సంక్షేమాన్ని యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.