: నన్ను చూస్తే రాహుల్ కు ముచ్చెమటలు పడతాయి: యడ్యూరప్ప
తనను, తన పాప్యులారిటీని చూస్తే కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పడతాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప అన్నారు. తన గురించి రాహుల్ మాట్లాడుతున్నారంటే... కాంగ్రెస్ పార్టీ తనకు భయపడుతోందని అర్థమవుతోందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని తెలిపారు.