: కేసీఆర్ పై విరుచుకుపడ్డ పొన్నాల


టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తనపై కేసీఆర్ దుర్భాషలాడటాన్ని దురహంకారంగా అభివర్ణించారు. ఏనాడూ అభివృద్ధి గురించి మాట్లాడని కేసీఆర్... ఇప్పుడు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని ఆరోపించారు. అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కూడా బంగారు తెలంగాణ అంటున్నాడని అన్నారు. రానున్న 20 ఏళ్లలో 70 లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా తన ఖాతాలోకి వేసుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని... సరైన సమయంలో బుద్ధి చెపుతారని తెలిపారు.

  • Loading...

More Telugu News