: వైకాపాలో చేరనున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, పార్థసారథి?
మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథిలు రేపు వైకాపాలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ సాయంత్రం కాని, రేపు ఉదయం కానీ వైఎస్సార్సీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దినేష్ రెడ్డి ఒంగోలు లేదా మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాలను ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి కూడా ఒంగోలు సీటును ఆశిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, కొద్ది రోజుల క్రితం దినేష్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి.