: చంద్రబాబు నాయకత్వంలోనే సీమాంధ్ర అభివృద్ధి: దివాకర్ రెడ్డి


చంద్రబాబు నాయకత్వంలోనే సీమాంధ్ర అభివృద్ధి జరుగుతుందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ఉద్దేశంతోనే తానూ తెలుగుదేశం పార్టీలో చేరినట్టు ఆయన చెప్పారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పలువురు నేతలు జేసీ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్ఠానానికి విభజనవల్ల కలిగే నష్టాలను అనేకసార్లు వివరించానని, అయితే వారు స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. టీడీపీలోకి వచ్చే ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News