: నేతలకు సర్ది చెబుతున్నందుకే ప్రెస్ మీట్ కు హాజరుకాలేకపోయా: కిషన్ రెడ్డి


పొత్తుల చర్చలు ముగిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ అగ్రనేత జవదేకర్ ల మీడియా సమావేశానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరుకాలేదు. ఇది సర్వత్ర చర్చనీయాంశం అయింది. దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. టీడీపీతో పొత్తు వద్దంటున్న తెలంగాణ జిల్లాల అధ్యక్షులకు సర్దిచెబుతున్నందునే ప్రెస్ మీట్ కు హజరుకాలేకపోయానని తెలిపారు. కొంత మంది నాయకుల్లో చెలరేగిన అసంతృప్తి రెండు రోజుల్లో సర్దుకుంటుందని చెప్పారు. పొత్తు విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీలను కార్యకర్తలు గెలిపిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News