: కొందరికి అసంతృప్తి ఉండడం సహజం: చంద్రబాబు
పొత్తులో భాగంగా కొన్ని సీట్లను బీజేపీకి కేటాయించాల్సిన అవసరం ఉంటుందని... దీంతో కొన్ని స్థానాల్లో టీడీపీ నేతలకు టికెట్ దొరకదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీకి కేటాయించే స్థానాల్లోని టీడీపీ నేతలకు అసంతృప్తి ఉండటం సహజమని చెప్పారు. నేను ఏది చేసినా టీడీపీ నాయకులందరితోనూ చర్చించే చేస్తానన్నారు. అసంతృప్తితో ఉన్నవారితో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.