: బీజేపీలో చేరిన గోకరాజు గంగరాజు
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు గంగరాజు బీజేపీలో చేరారు. విజయవాడలో సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు సమక్షంలో ఈ రోజు గంగరాజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్ఎస్ఎస్ తో గంగరాజుకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. మరోవైపు విజయవాడలో సీమాంధ్ర బీజేపీ కార్యాలయం ఈ రోజు ప్రారంభం కానుంది.