: టీడీపీ, బీజేపీల పొత్తు చారిత్రక నిర్ణయం: జవదేకర్


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ అగ్రనేత జవదేకర్ ల సమావేశం ముగిసింది. అనంతరం వీరు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ... ఈ రెండు పార్టీల పొత్తుకోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిందని చెప్పారు. టీడీపీ, బీజీపీల పొత్తు చారిత్రక నిర్ణయమని చెప్పారు. బీజేపీ, టీడీపీలు కలసి సీమాంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పనిచేస్తాయని చెప్పారు. ఈ పొత్తు కోసం గత 10-15 రోజులుగా చర్చలు జరిపామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో 272కు పైగా లోక్ సభ స్థానాలను గెలుచుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News