: పుండు మీద కారం అంటే ఇదే..


అసలే కరెంటు కష్టాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంటే ఇవాళ రాష్ట్రంలోని రెండు ప్రధాన విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా దాదాపు వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 

కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం 11వ యూనిట్ లో సాంకేతిక లోపం ఏర్పడి 550 మెగావాట్లు, విజయవాడ వీటీపీఎస్ 7వ యూనిట్ బాయిలర్లో సాంకేతిక లోపం తలెత్తి 500 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. 30 నిమిషాల అనంతరం విజయవాడ యూనిట్ ను మళ్లీ సర్వీసులోకి తీసుకు వచ్చారు.  

  • Loading...

More Telugu News