: పొత్తుపై భగ్గు... నరసారావుపేట నుంచి నేనే పోటీ చేస్తా: కోడెల


బీజేపీ, టీడీపీ పొత్తుపై ఆదిలోనే మంటలు రాజుకుంటున్నాయి. పొత్తులో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేట స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో స్థానిక టీడీపీ నేతలు కోడెల శివప్రసాదరావు నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. బీజేపీకి సీటు ఇవ్వడంపై మండిపడ్డారు. దీంతో నరసారావు పేట నుంచి తానే పోటీ చేస్తానని కోడెల ప్రకటించారు. బీజేపీతో పొత్తు వాస్తవ దృక్పథంతో ఉండాలని అన్నారు. గెలిచే సీట్లను బీజేపీ కోరుకోవాలని, కేడర్ లేని చోట పోటీచేయాలనుకోవడం సరికాదని సూచించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలసి తన అభిప్రాయం చెబుతానన్నారు.

  • Loading...

More Telugu News