: టీడీపీ వైఖరి విడ్డూరంగా ఉంది: రఘువీరా


టీడీపీ, బీజేపీలు పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీకీ వచ్చిన నష్టమేమీ లేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీలు భూస్థాపితం అవుతాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో గెలవలేని టీడీపీ... ఆ ప్రాంతంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం గంగుళవాయిపాళ్యంలో ఈ రోజు ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News