: వైకాపా, జేఎస్పీ కార్యకర్తల రాళ్లదాడి
స్థానిక సంస్థల ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో రణరంగాన్ని తలపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలో వైకాపా, జేఎస్పీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.