: ఎలక్షన్ డ్యూటీ కోసం వచ్చి అత్యాచారం చేశాడు
ఎన్నికల విధులను నిర్వహించడానికి వచ్చిన ఓ కానిస్టేబుల్ అదును చూసుకుని ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా త్రిపురారం మండలం దుగ్గేపల్లిలో జరిగింది. దుర్గారెడ్డి అనే కానిస్టేబుల్ దుగ్గేపల్లిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఓ ఆటోను అద్దెకు తీసుకుని పెట్రోలింగ్ చేస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి, అనంతరం అత్యాచారం జరిపాడు.
జరిగిన విషయాన్ని బాధితురాలు తన బంధువులకు తెలిపింది. దీంతో బాధితురాలు, ఆమె బంధువులు త్రిపురారం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, ఈ విషయాన్ని తర్వాత చూద్దామని పోలీసులు వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో, ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. విధిలేని పరిస్థితుల్లో కానిస్టేబుల్ దుర్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.