: గరుడ ప్రసాదం కోసం భద్రగిరికి పోటెత్తిన భక్తులు
భద్రాచలం రామయ్య సన్నిధిలో ఇచ్చే గరుడ ప్రసాదం సంతానాన్ని ఇస్తుందని మహిళలు భావిస్తుంటారు. ఇందు కోసం ఈ రోజు అధిక సంఖ్యలో మహిళలు భద్రాచలం రామయ్య సన్నిధానానికి రాగా, సిబ్బంది ప్రసాదాన్ని పంచిపెట్టారు. శ్రీసీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు ఈ రోజు అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం ఘనంగా జరిగింది.