: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గృహనిర్బంధం
వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని ప్రకాశం జిల్లా కొనకమెట్ల మండలం సినారికట్లలో గృహనిర్బంధంలో ఉంచారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ముందు జాగ్రత్తగా ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచినట్టు ఎస్సై మస్తాన్ షరీఫ్ తెలిపారు. పోలింగ్ ముగిసేవరకు గృహ నిర్బంధంలో ఉంచనున్నట్టు ఎస్సై తెలిపారు.