: టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు ఖరారు
టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు ఖరారైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య శనివారం రాత్రి పొద్దుపోయేవరకు సుదీర్ఘంగా 6 గంటలపాటు సాగిన చర్చల అనంతరం పొత్తు ఖరారైంది. దీనిలో భాగంగా తెలంగాణలో 47 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు, సీమాంధ్రలో 15 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలను బీజేపీకి కేటాయించారు. దీంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇరు పార్టీలు సంయుక్త ప్రకటన చేయనున్నాయి.