: ఓటర్లలో ఛైతన్యం కోసం ‘‘మట్టి కుండలతో మంచి ఐడియా’’


రాజస్థాన్ లోని బార్మెర్ నియోజకవర్గంలో ఓటర్లకు ఓటుహక్కుపై చైతన్యం కలిగించేందుకు జిల్లా అధికారులు ఎంచుకున్న ప్రక్రియతో బార్మెర్ వార్తల్లోకెక్కింది. మండే ఎండల్లో మట్టి కుండల్లోని చల్లని నీళ్లు సామాన్యులను సేదతీర్చుతాయనడంలో సందేహం ఏముంది? అందుకే అధికారులు జిల్లాలోని కుమ్మరులను పిలిచి వారి చేత రకరకాల కుండలు తయారుచేయించారు. వాటిపై ఓటుహక్కు ప్రాధాన్యం తెలియజేస్తూ నినాదాలు రాయించి అమ్మకానికి పెట్టారు. దాంతో ఆ మట్టి కుండలను కొనుక్కున్న వారందరికీ ఓటు విలువ నినాదం చేరుతుందన్న మాట. మరి, మట్టికుండల ఐడియానా, మజాకా!

  • Loading...

More Telugu News